Watermelone: పుచ్చకాయ నుంచి గింజలను ఇట్టే తీసిపారేయచ్చు ... ఇదిగో ఇలా ట్రై చేయండి!

  • వేసవిలో సేదదీర్చే పుచ్చకాయ
  • గింజలను వేరుచేయడం సులువే
  • నెట్టింట వీడియో వైరల్

ఎండ మంటలు పుట్టిస్తున్న వేళ, కాస్తంత సేదదీర్చేందుకు పుచ్చకాయ ఎంతో సహాయపడుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ఎటొచ్చీ పుచ్చకాయలో ఉండే గింజలను నమిలి తినలేక, వాటిని వేరు చేయడానికి పడే శ్రమే ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక పుచ్చకాయలోని గింజలను చాలా సులువుగా వేరు చేయవచ్చని చెబుతూ నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతోంది.

ఓ పద్ధతి ప్రకారం, పుచ్చకాయను త్రికోణపు ఆకారంలో ముక్కలుగా కోయడం ద్వారా ఒకవైపు మాత్రమే గింజలు వస్తాయని, వాటిని సులువుగా తీసివేయవచ్చని చూపుతున్న ఈ వీడియోను మీరూ చూడండి.

  • Loading...

More Telugu News