Anantapur District: స్వగ్రామంలో నేడు చమన్ అంత్యక్రియలు

  • చమన్ స్వగ్రామం ఆర్. కొత్తపల్లిలో అంత్యక్రియలు
  • అధికార లాంఛనాలతో నిర్వహించనున్న అంత్యక్రియలు  
  • పరిటాల అభిమానులు, టీడీపీ శ్రేణుల్లో నెలకొన్న విషాదఛాయలు

మాజీ మంత్రి పరిటాల రవి ప్రధాన అనుచరుడు చమన్ గుండెపోటుతో నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలను ఆయన స్వగ్రామం ఆర్. కొత్తపల్లిలో ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహించనున్నారు. అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు సమాచారం. కాగా, చమన్ హఠాన్మరణంతో పరిటాల అభిమానులు, టీడీపీ శ్రేణుల్లో విషాదఛాయలు అలముకున్నాయి. చమన్ కుటుంబానికి పలువురు టీడీపీ నేతలు తమ సంతాపం తెలిపారు. చమన్ భార్య రమీజాబేగం, కుమారుడిని ఓదార్చారు.  

Anantapur District
chaman
  • Loading...

More Telugu News