Hyderabad: హైదరాబాద్ లో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు!

  • రాబోయే రెండు మూడ్రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి
  • 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయి
  • బేగంపేట వాతావరణ శాఖాధికారులు 

రాబోయే రెండు మూడ్రోజుల్లో హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో వాతావరణం క్రమేపి చల్లబడినప్పటికీ మళ్లీ వేడెక్కుతోంది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు బేగంపేట వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం మాట్లాడుతూ, మే నెలలో సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల అధికంగా వాతావరణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. కాగా, గత ఐదు రోజులుగా హైదరాబాద్ లో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40.7, 39.3, 39.0,  35.5, 39.0 కాగా, కనిష్ఠ ఉష్ణోగ్రతలు  25.8, 27.3, 25.8, 21.9, 26.9 గా ఉన్నాయి.

Hyderabad
temperature
  • Loading...

More Telugu News