bundh: తెలంగాణలో బంద్ పాటించిన ఆర్టీసీ సిబ్బంది.. కదలని బస్సులు.. ప్రయాణికుల అవస్థలు!

  • తెలంగాణ మజ్దూర్‌ యూనియన్ బస్‌ భవన్‌ ముట్టడికి పిలుపు
  • తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
  • డిపోల నుంచి కదలని బస్సులు
  • బస్సులు దొరకడమే గగనంలా మారిన వైనం

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలో ఈ రోజు ఆర్టీసీ బస్సులు అతి తక్కువగా రోడ్లపై కనపడ్డాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. బస్సులు రాకపోవడంతో బస్టాండులు అన్నీ ప్రయాణికులతో నిండిపోయి కనపడ్డాయి. ఆర్టీసీ బస్సులు దొరకడమే గగనంలా మారడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తూ ఆటోలు, ప్రైవేటు వాహనాల్లో అధిక ఛార్జీలు సమర్పించుకుని ప్రయాణించారు.
 
తమ సమస్యలు పరిష్కరించాలంటూ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్ బస్‌ భవన్‌ ముట్టడికి పిలుపునివ్వడంతో ఈ రోజు ఆర్టీసీ సిబ్బంది బంద్‌ పాటించారు. దీంతో చాలా బస్సులు డిపోల నుంచి కదలలేదు. 

bundh
bus
Hyderabad
Telangana
  • Loading...

More Telugu News