shivaji: ఐవైఆర్ గారు, మీకు దణ్ణం పెడతాం.. ఈ రెండింటి జోలికి రాకండి!: హీరో శివాజీ ఫైర్

  • మొన్నటి దాకా అమరావతిపై పడ్డారు
  • ఇప్పుడు వెంకటేశ్వరస్వామిపై పడ్డారు
  • ఇప్పుడున్న ప్రభుత్వాన్ని తోసేయాలన్నదే ఆలోచన

ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావుపై సినీనటుడు శివాజీ తీవ్ర విమర్శలు గుప్పించారు. హాయిగా రిటైర్మెంటు జీవితాన్ని అనుభవించకుండా... పనికిరాని పనులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. మొన్నటి దాకా అమరావతిపై పడ్డారని, ఒక పనికిమాలిన పుస్తకాన్ని కూడా రాశారని... ఇప్పుడు తిరుమల మీద పడ్డారని విమర్శించారు. ఈయనకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మద్దతు ఒకటి అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రం వీరు ఎన్నడూ పోరాడరని మండిపడ్డారు. ఐదేళ్ల పాలన కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎట్లా తోసేయాలనేదే వీరి ఆలోచన అని దుయ్యబట్టారు.

ఐవైఆర్ గారూ, అసలు మీ సమస్య ఏమిటంటూ శివాజీ సూటిగా ప్రశ్నించారు. ఐఏఎస్ అధికారిగా అన్నీ అనుభవించారని... ఇప్పుడు హాయిగా ఇంట్లో కూర్చొని రిటైర్మెంట్ జీవితాన్ని అనుభవించవచ్చు కదా? అని అన్నారు. 'ఇప్పుడున్న ప్రభుత్వం పోయి, కొత్త ప్రభుత్వం వచ్చి, మీకు ఏదో ఒక పదవి ఇవ్వాలి... ఆ తర్వాత మరో ప్రభుత్వం వచ్చి, మరో పదవి మీకు ఇవ్వాలి'... ఇదే కదా మీ ఆలోచన? అని ప్రశ్నించారు. మీకు దణ్ణం పెడతాం.. అమరావతి, వెంకన్న స్వామి జోలికి రావద్దని విన్నవించారు. 

shivaji
iyr krishna rao
amaravathi
tirumala
  • Loading...

More Telugu News