sun: వచ్చే రెండు రోజుల్లో వేడిగాలుల తీవ్రత మరింత అధికం
- దేశంలో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదు
- నిన్న ఖర్గోనీలో అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత
- సాధారణం కంటే వేడిగాలుల తీవ్రత అధికం
దేశ వ్యాప్తంగా ఎండల తీవ్రత, వేడిగాలులు అధికమయ్యాయి. భానుడి భగభగలకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వచ్చే రెండు రోజుల్లో వేడిగాలుల తీవ్రత మరింత పెరుగుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. దేశంలోని చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్నాయని, నిన్న మధ్యప్రదేశ్ ఖర్గోనీలో అత్యధికంగా 45.1డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతాయని పేర్కొంది. ఈ రోజు దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే వేడిగాలుల తీవ్రత అధికంగా నమోదవుతోంది.