sami: అద్నాన్‌ సమి బృందానికి కువైట్‌ విమానాశ్రయంలో చేదు అనుభవం!

  • ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్‌ అధికారుల అసభ్యకర ప్రవర్తన
  • భారతీయ కుక్కలు అంటూ అనుచిత వ్యాఖ్యలు
  • ట్వీట్‌ చేసి చెప్పిన గాయకుడు అద్నాన్ సమి

తాము ఎంతో ప్రేమతో కువైట్‌ నగరానికి వచ్చామని, కానీ, తమతో అకారణంగా కువైట్‌ ఎయిర్‌పోర్ట్‌లోని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అసభ్యకరంగా ప్రవర్తించారని ప్రముఖ గాయకుడు అద్నాన్‌ సమి ట్వీట్‌ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ బందాన్ని భారతీయ కుక్కలు అంటూ వారు అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఈ విషయం గురించి తాము సంబంధిత అధికారులకు ‌ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇంత పొగరుగా ప్రవర్తించడానికి వారికి ఎంత ధైర్యమని, కువైట్‌లోని భారత దౌత్య కార్యాలయానికి, భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కి ట్వీట్‌ చేశారు.

ఆయనకు ఎదురైన చేదు అనుభవంపై సుష్మా స్వరాజ్‌ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. తనతో ఫోన్‌లో మాట్లాడమని అడిగారు. మరో ట్వీట్‌ చేసిన అద్నాన్‌ సమి మంచి మనసున్న సుష్మ స్వరాజ్‌కు నా ధన్యవాదాలు అని, ఆమె తనకు, తన టీమ్‌కు సాయం చేస్తున్నారని తెలిపారు. ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా సుష్మ స్వరాజ్‌ సాయం చేస్తున్నందుకు గర్వపడుతున్నామని పేర్కొన్నారు.

sami
kuwait
Twitter
  • Error fetching data: Network response was not ok

More Telugu News