savitri: ఒక దశలో సావిత్రి నన్ను అపార్థం చేసుకుంది: 'షావుకారు' జానకి

- సావిత్రిని సినిమాల్లోకి రాకముందే చూశాను
- సంసారం'లో చిన్నపాత్ర వేసింది
- 'దేవదాసు'లో పార్వతి పాత్ర ముందుగా నాకు వచ్చింది
తెలుగు తెరపై సహజమైన నటనను ఆవిష్కరించిన నటీమణులలో షావుకారు జానకి ఒకరు. కథానాయికగాను .. ఆ తరువాత ముఖ్యమైన పాత్రల్లోను అద్భుతమైన హావభావాలతో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాంటి 'షావుకారు' జానకి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సావిత్రితో తనకి గల అనుబంధం గురించి ప్రస్తావించారు. " జెమినీ సంస్థ వారు నిర్మించే 'ముగ్గురు కొడుకులు' సినిమాలో వేషం కోసం నేను అక్కడికి వెళ్లినప్పుడు అక్కడ నాకు గణేశన్ పరిచయమయ్యాడు. ఆ సినిమాలో నాకు అవకాశం వచ్చేలా చేశాడు"
