chaman: జిల్లా రాజకీయాల్లో చమన్ చాలా క్రియాశీలకంగా ఉండేవారు: చంద్రబాబు

  • చమన్ మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన చంద్రబాబు
  • టీడీపీ మంచి నాయకుడిని కోల్పోయిందన్న సీఎం
  • చమన్ ఆత్మకు శాంతి చేకూరాలి

పరిటాల రవి ముఖ్య అనుచరుడు, అనంతపురం జిల్లాపరిషత్ మాజీ ఛైర్మన్ చమన్ ఈరోజు హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాజకీయాల్లో చమన్ చాలా క్రియాశీలకంగా ఉండేవారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని అన్నారు. చమన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేశారు. మరోవైపు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ కూడా సంతాపం ప్రకటించారు. చమన్ ఈ ఉదయం గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. 

chaman
Chandrababu
Yanamala
Nara Lokesh
  • Loading...

More Telugu News