chaman: చమన్ మృతదేహాన్ని చూసి స్పృహ కోల్పోయిన పరిటాల సునీత.. చికిత్స అందిస్తున్న వైద్యులు

  • చమన్ మరణంతో షాక్ కు గురైన పరిటాల సునీత
  • బిగ్గరగా రోదిస్తూ, స్పృహ కోల్పోయిన వైనం
  • కంటతడి పెట్టుకున్న శ్రీరామ్

తమకు అత్యంత ఆప్తుడైన చమన్ మరణంతో పరిటాల కుటుంబం షాక్ కు గురైంది. అనంతపురంలోని సవేరా ఆసుపత్రిలో చమన్ మృతదేహాన్ని చూడగానే మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు శ్రీరామ్ లు కన్నీరుమున్నీరయ్యారు. శ్రీరామ్ ను పట్టుకుని సునీత బిగ్గరగా రోదించారు. ఆమెను కంట్రోల్ చేయడానికి శ్రీరామ్ యత్నించారు. ఇదే సమయంలో, పరిటాల సునీత స్పృహ కోల్పోయారు. కిందకు పడిపోయారు. వెంటనే స్పందించిన డాక్టర్లు ఆమెకు చికిత్సను ప్రారంభించారు. మరోవైపు, చమన్ మరణంతో అనంతపురం టీడీపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. మంచి మనిషిని కోల్పోయామని జిల్లా నేతలు ఆవేదనను వ్యక్తం చేశారు. 

chaman
paritala sunitha
  • Loading...

More Telugu News