charan: భారీ లాభాలు తెచ్చిపెట్టిన 'రంగస్థలం'

  • ఘన విజయాన్ని సాధించిన 'రంగస్థలం'
  • రికార్డు స్థాయిలో వసూళ్లు
  • ప్రతి ప్రాంతంలోను లాభాలు  

ఈ మధ్య కాలంలో టాక్ పరంగాను .. వసూళ్ల పరంగాను ఒక రేంజ్ లో స్పీడ్ చూపించిన మూవీ ఏది అంటే 'రంగస్థలం' అని ఎవరైనా చెప్పేస్తారు. అంతలా ఈ సినిమా ప్రేక్షకుల మనసులను కట్టి పడేసింది .. ఒకటికి రెండుసార్లు వాళ్లు థియేటర్లకు వచ్చేలా చేసింది. ఈ కారణంగా ఈ సినిమా లాభాల పంట పండిస్తూ వెళుతోంది.

 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా, 120 కోట్ల షేర్ ను రాబట్టింది. నైజామ్ ఏరియాలో 18 కోట్లకు అమ్ముడు కాగా, 34 రోజుల్లో 27 కోట్లను వసూలు చేసింది. సీడెడ్లో 12 కోట్లకు అమ్ముడుపోగా అంతే సమయంలో 17 కోట్లను రాబట్టింది. ఉత్తరాంధ్రలో 8 కోట్లకి పోయిన ఈ సినిమా,12.08 కోట్ల షేర్ ను తెచ్చిపెట్టింది. ఓవర్సీస్ రైట్స్ 9 కోట్లకి పోగా 16.5 కోట్ల షేర్ వచ్చింది. ఇలా ఈ సినిమా భారీ లాభాలను సొంతం చేసుకుంటూ చరణ్ కెరియర్లోనే ది బెస్ట్ గా నిలిచింది. మొత్తానికి చరణ్ ఈ ఏడాది మాస్ ఆడియన్స్ కి మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు.   

  • Loading...

More Telugu News