roja: రోజాను ఉద్దేశించి సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు: వైసీపీ అధికార ప్రతినిధి పద్మజ

  • అచ్చోసిన ఆంబోతుల్లా రోజాపై దాడి చేస్తున్నారు
  • కాల్ మనీ కాలనాగులతో విమర్శలు చేయిస్తున్నారు
  • టీడీపీ అసమర్థపాలనను ప్రశ్నిస్తున్నందుకే దాడులు

ఎమ్మెల్యే రోజాను ఉద్దేశించి తెలుగుదేశం నేతలు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారంటూ వైసీపీ అధికార ప్రతినిధి పద్మజ మండిపడ్డారు. టీడీపీ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు. అచ్చోసిన ఆంబోతుల్లా రోజాపై దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్ మనీ కాలనాగులతో రోజాపై విమర్శలు చేయిస్తున్నారని అన్నారు.

మహిళలంటే టీడీపీ నేతలకు గౌరవం లేదని మండిపడ్డారు. టీడీపీ అసమర్థ పాలనను ప్రశ్నిస్తున్న మహిళలపై ఎదురుదాడి చేయిస్తున్నారని విమర్శించారు. ఓ దళిత మహిళను టీడీపీ ఎమ్మెల్యే వివస్త్రను చేయించినా, ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. నారాయణ విద్యాసంస్థల్లో బాలికల ఆత్మహత్యలకు సంబంధించి మంత్రి నారాయణపై చర్యలు తీసుకోగలరా? అని ఆమె ప్రశ్నించారు. 

roja
padmaja
YSRCP
Telugudesam
attack
  • Loading...

More Telugu News