chaman: పరిటాల రవి ప్రధాన అనుచరుడు, మాజీ జెడ్పీ ఛైర్మన్ చమన్ మృతి

  • గుండెపోటుకు గురైన చమన్
  • ఆసుపత్రికి తరలించినా, దక్కని ఫలితం
  • నివాళి అర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించిన పరిటాల సునీత

మాజీ మంత్రి పరిటాల రవి ప్రధాన అనుచరుడు చమన్ గుండెపోటుతో మృతి చెందారు. రవి స్వగ్రామం వెంకటాపురంలో ఆయన ఈ ఉదయం గుండెపోటుకు గురయ్యారు. వెంటనే అక్కడ నుంచి అనంతపురంలోని ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్న సమయంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు.

చమన్ మరణవార్త తెలియగానే మంత్రి పరిటాల సునీత హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఆయనకు నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిన్న జరిగిన పరిటాల రవి, సునీతల కుమార్తె వివాహానికి చమన్ హాజరయ్యారు. వివాహం సందర్భంగా ఆందరినీ పలకరిస్తూ, ఎంతో ఉల్లాసంగా గడిపారు. చమన్ మరణవార్తతో టీడీపీ నేతలు షాక్ అయ్యారు. అనంతపురం పట్టణంలో విషాదం నెలకొంది. అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్మగా కూడా చమన్ పని చేశారు.

chaman
paritala ravi
paritala sunitha
dead
heart attack
anantapur
  • Loading...

More Telugu News