hero sivaji: ఏపీలో కొత్త అలజడులు సృష్టించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది: నటుడు శివాజీ

  • తిరుమల శ్రీవారి ఆలయంపై కుట్ర చేసేందుకు చూస్తోంది
  • కొత్త కొత్త కుల పోరాటాలు జరిగేలా ప్రయత్నిసోంది
  • ప్రత్యేక హోదా లేకుండా ఏపీలో ఏమీ చేయలేం

ఏపీ పునర్విభజన చట్టాలు అమలు చేయని కేంద్ర ప్రభుత్వంపై నటుడు శివాజీ మరోసారి మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో కొత్త అలజడులు సృష్టించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అందులో భాగంగానే తిరుమల శ్రీవారి ఆలయంపై కుట్ర చేస్తోందని, కొత్త కొత్త కుల పోరాటాలు పుట్టుకొచ్చేలా కేంద్రం ప్రయత్నిసోందని వ్యాఖ్యానించారు.

ఏపీకి ప్రత్యేక హోదా లేకుండా ఈ రాష్ట్రంలో ఏమీ చేయలేమని .. ‘హోదా’ సాధించలేనప్పుడు మనం తెలుగు వాళ్లగా ఉండటం వృథా అని అన్నారు. ఏపీ లోని అన్ని రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి, ధైర్యం ఉంటే కర్ణాటకలో బీజేపీని ఓడించాలని పిలుపు నివ్వాలని, అప్పుడే ప్రజలు ఆ పార్టీలను నమ్ముతారని అన్నారు.

ప్రత్యేక హోదా కోసం ‘జాగారం’ చేస్తా

ప్రత్యేక హోదా సాధన నిమిత్తం ఈ నెల 10న జాగారం కార్యక్రమం చేపడతామని శివాజీ చెప్పారు. 10వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 11వ తేదీ ఉదయం 7 గంటల వరకు ఈ జాగారం కొనసాగుతుందని అన్నారు. బీజేపీ నేతలకు ‘జాగారం’ సెగ తగలాలని, హోదా ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, తనకు ఎలాంటి రాజకీయ అజెండాలు లేవని అన్నారు.

hero sivaji
Andhra Pradesh
  • Loading...

More Telugu News