Karnataka: పవన్ కల్యాణ్ వస్తారో... రారో చెప్పలేను: జేడీ (ఎస్) నేత కుమారస్వామి

  • కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు
  • గతంలో జేడీ (యస్) తరఫున ప్రచారం చేస్తానన్న పవన్ కల్యాణ్
  • అనివార్య కారణాల వల్ల రాలేకపోయారన్న కుమారస్వామి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వస్తారో... రారో చెప్పలేనని జనతాదళ్ (యునైటెడ్) నేత కుమారస్వామి వ్యాఖ్యానించారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ, ఓ తెలుగు టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, రాష్ట్ర ప్రజలు ఎవరికి అధికారాన్ని ఇవ్వాలన్న అంశంపై పూర్తి స్పష్టతతో ఉన్నారని, హంగ్ ఏర్పడే ప్రసక్తే లేదని, తమ పార్టీ 120కి పైగా స్థానాలను సులువుగా గెలుచుకుంటుందని చెప్పారు.

గతంలో పవన్ కల్యాణ్ ఇక్కడికి వచ్చి, తమ పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తానని చెప్పారని, అయితే, కొన్ని అనివార్య కారణాల వల్లే ఆయన ఇంతవరకూ రాలేకపోయారని చెప్పిన ఆయన, ప్రచారం ముగిసే సమయం దగ్గర పడిందని గుర్తు చేశారు. ఈ సమయంలో ఆయన పర్యటన ఉంటుందో ఉండదో కచ్చితంగా చెప్పలేనని అన్నారు.

Karnataka
Kumaraswamy
JD (S)
  • Loading...

More Telugu News