air india: విమానంలో నన్ను లైంగికంగా వేధించాడు: పైలట్ పై ఎయిర్ హోస్టెస్ ఫిర్యాదు

  • అహ్మదాబాద్ నుంచి ముంబై వస్తుండగా వేధింపులు
  • ముంబైలోని సహారా పీఎస్ లో ఎయిర్ హోస్టెస్ ఫిర్యాదు
  • ఐపీసీ 354 కింద కేసు నమోదు చేసిన పోలీసులు

లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కామాంధుల్లో పరివర్తన రావడం లేదు. తాజాగా మరో లైంగిక వేధింపుల ఘటన వెలుగు చూసింది. తనను లైంగికంగా వేధించాడంటూ ఎయిర్ ఇండియాకు చెందిన విమాన పైలెట్ పై ఓ ఎయిర్ హోస్టెస్ ఫిర్యాదు చేసింది.

ముంబైలోని సహారా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. అహ్మదాబాద్ నుంచి ముంబై వస్తున్న సమయంలో విమానంలో తనను లైంగికంగా వేధించాడని తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో, పైలట్ పై ఐపీసీ 354 కింద పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు. మరోవైపు, ఈ ఘటనపై స్పందించేందుకు ఎయిర్ ఇండియా ప్రతినిధి అందుబాటులోకి రాలేదు.

air india
pilot
air hostess
sexual harrassment
  • Loading...

More Telugu News