osmania hospital: ఉస్మానియాలో గ్యాంగ్ రేప్.. పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కమిషనర్

  • మహిళను అర్ధరాత్రి వైద్యం కోసం పంపారు
  • తోడుగా ఎవరైనా వెళ్లాలన్న బాధ్యతను కూడా మరిచారు
  • ఈ ఘటనతో హైదరాబాద్ పోలీసులకు చెడ్డ పేరు వచ్చింది
  • మరోసారి ఇలాంటివి జరగకూడదు

ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన ఓ మహిళపై జరిగిన గ్యాంగ్ రేప్ పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తీవ్రంగా స్పందించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే మహిళలను జాగ్రత్తగా చూసుకోవాలంటూ పోలీసులను హెచ్చరించారు. ఈ మేరకు తన వాయిస్ రికార్డింగును పోలీసు అధికారులకు, సిబ్బందికి వాట్సాప్ ద్వారా పంపారు.

"మిత్రులారా, ఉస్మానియా ఆసుపత్రిలో జరిగిన దారుణాన్ని అందరూ పేపర్ లో చూశారు కదా. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి ఒక మహిళ వెళ్లింది. ఆమెను అర్ధరాత్రి పూట వైద్యం కోసం ఉస్మానియాకు పంపారు. ఆమె వెంట సెక్యూరిటీగా వెళ్లాలనే బాధ్యతను కూడా మరిచారు. అక్కడ ఆమెపై రేప్ జరిగింది. ఆసుపత్రి ఔట్ పోస్టులో ఉన్న ఒక హోంగార్డు కూడా ఈ నేరంలో ఉన్నాడు. ఈ ఘటనతో హైదరాబాద్ పోలీసులకు చెడ్డ పేరు వచ్చింది. ప్రతి కేసును కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోండి" అంటూ పోలీసు అధికారులను, సిబ్బందిని కమిషనర్ హెచ్చరించారు. 

osmania hospital
gang rape
hyderabad
police commissioner
  • Loading...

More Telugu News