Punjab: అసభ్యకరమైన మెసేజ్ లను పంపుతున్న ప్రొఫెసర్ ను ఉతికేసిన విద్యార్థిని... వీడియో ఇదిగో!

  • పంజాబ్ పాటియాలా ప్రభుత్వ మహిళా కళాశాలలో ఘటన
  • సెల్ ఫోన్ కు అసభ్య సందేశాలు పంపిన ప్రొఫెసర్
  • సహ విద్యార్థినులు, లెక్చరర్స్ తో కలసి దాడి

తనకు అసభ్యకరమైన మెసేజ్ లు పంపి వేధిస్తున్న ప్రొఫెసర్ ను రోడ్డుపైకి లాక్కొచ్చి ఉతికి ఆరేసిందో విద్యార్థిని. పంజాబ్ లోని పాటియాలాలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో జరిగిందీ ఘటన. మరిన్ని వివరాల్లోకి వెళితే, గత కొంతకాలంగా ఓ ప్రొఫెసర్, బాధితురాలి సెల్ ఫోన్ కు అసభ్య సందేశాలు పంపుతున్నాడు.

 అతని వేధింపులతో సహనం కోల్పోయిన బాధితురాలు, సదరు ప్రొఫెసర్ ను సహ విద్యార్థులు, మరో ప్రొఫెసర్, మహిళా లెక్చరర్లతో కలసి నిలదీసింది. ఈ ఘటన దృశ్యాలు మీడియాకు చిక్కాయి. అతని నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేసిందా విద్యార్థిని. కాగా, ఇటీవలి కాలంలో విద్యార్థినులను వేధిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటీవల దేశ రాజధానిలో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలోనూ ఇటువంటి ఘటనే నమోదైంది.

Punjab
Patiyala
Government Women College
Harrasment
  • Error fetching data: Network response was not ok

More Telugu News