naa nuvve: నా కలను జయేంద్ర నిజం చేశారు : హీరో కల్యాణ్ రామ్

  • కెమెరామెన్ పీసీ శ్రీరామ్ తో కలిసి పని చేసే ఛాన్స్ రాదనుకున్నా
  • ఆ కలను ఈ చిత్రం ద్వారా జయేంద్ర నెరవేర్చారు
  • గొప్ప కెమెరామెన్ పీసీ శ్రీరామ్  

జయేంద్ర దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా రూపొందిన చిత్రం ‘నా నువ్వే’. ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్ కెమెరామెన్ గా వ్యవహరించారు. గొప్ప కెమెరామెన్ పీసీ శ్రీరామ్ తో కలిసి పనిచేసే అవకాశం రాదేమోనని అనుకున్నానని, కానీ, ఆ అవకాశం జయేంద్ర ద్వారా తనకు లభించిందని కల్యాణ్ రామ్ అన్నారు.

‘ప్రేమకథా చిత్రాలు తీసే జయేంద్ర.. మాస్ చిత్రాలు చేసే నాతో సినిమా తీస్తారంటే మొదట్లో నమ్మలేదు. ఈ చిత్ర కథను జయేంద్ర నాకు చెప్పడంతో షాకయ్యా. పీసీ శ్రీరామ్ కెమెరామెన్ అనే విషయం తెలిసి మరింత ఆశ్చర్యపోయా! ఎందుకంటే, ఎన్నో గొప్ప చిత్రాలకు కెమెరామెన్ గా వ్యవహరించిన ఆయనతో కలిసి పనిచేసే అవకాశం లభించడం ఒక కలే అనుకున్నా.. అది సాధ్యమయ్యే పని కాదనుకున్నా. కానీ, నా కలను జయేంద్ర నిజం చేశారు’ అని కల్యాణ్ రామ్ సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ‘నా నువ్వే’ ఆడియో వేడుక నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన తమన్నా నటించింది.

naa nuvve
hero kalyanram
  • Loading...

More Telugu News