Puri Jagannadh: మహేష్ బాబు కాకుంటే మరొకరు... ఆ సినిమా మాత్రం తీసి తీరుతా: పూరీ జగన్నాధ్

  • గతంలో మహేష్ బాబుతో 'జనగణమన' ప్లాన్
  • కానీ మహేష్ ఏమీ చెప్పలేదన్న పూరీ
  • మరో హీరోతోనైనా తీస్తానని స్పష్టీకరణ

తన కుమారుడిని టాలీవుడ్ లో హీరోగా నిలపాలన్న ఉద్దేశంతో మలిప్రయత్నంగా 'మెహబూబా' నిర్మించి, దాన్ని 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న దర్శకుడు పూరీ జగన్నాథ్, ఇప్పుడా చిత్రం  ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. తాజాగా, మీడియాతో మాట్లాడిన ఆయన, గతంలో తాను మహేష్ బాబు హీరోగా తలపెట్టిన 'జనగణమన' చిత్రాన్ని ప్రస్తావించారు.

మహేష్ తో 'బిజినెస్ మేన్' తీసిన తరువాత 'జనగణమన' ప్లాన్ చేశానని, అయితే, మహేష్ ఏమీ తేల్చలేదని పూరీ చెప్పారు. ఈ సినిమాను మహేష్ చేయకపోయినా ఆపబోనని, మరో హీరోతో ఈ సినిమాను తీస్తానని అన్నారు. సమాజానికి ఇటువంటి చిత్రం ఎంతో అవసరమని, అత్యాచార ఘటనలు విన్నా, చూసినా తనకెంతో బాధకలుగుతుందని, ఈ దేశం ఎలా పోతుందో అర్థం కావడం లేదనిపిస్తుందని అన్న పూరీ, భారతావని సుభిక్షంగా ఉండాలంటే ఏం చేయాలన్నదే 'జనగణమన' స్టోరీలైన్ అని చెప్పారు.

Puri Jagannadh
Mahesh Babu
Janaganamana
Mehabooba
  • Loading...

More Telugu News