Andhra Pradesh: రోజా పట్టపగలే మద్యం తాగి ప్రెస్ మీట్స్ పెడుతుంది: బుద్దా వెంకన్న ఆరోపణలు

  • కావాలంటే .. ఈసారి రోజా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు టెస్ట్ చేయండి
  • మహిళలు ఇబ్బంది పడేలా మాట్లాడటం రోజాకి అలవాటైపోయింది
  • రోజాను బురదలో దొర్లే పంది మాదిరిగా ఊరి మీదకు జగన్ వదిలేశాడు

వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మద్యం తాగి రోజా ప్రెస్ మీట్స్ పెడుతోందని ఆరోపించారు. ‘రోజా పట్టపగలు మద్యం తాగి ప్రెస్ మీట్స్ పెట్టి ఆమె ఇష్టానుసారం మాట్లాడుతుంది. కావాలంటే .. ఈసారి రోజా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆమెను టెస్ట్ చేయండి. ఆ టెస్ట్ ల్లో తేలిపోతుంది!

మహిళా లోకం ఇబ్బంది పడేలా మాట్లాడటం రోజారెడ్డికి అలవాటైపోయింది. ముఖ్యమంత్రి గారిని, మంత్రులను, మమ్మల్ని తన ఇష్టానుసారం మాట్లాడుతోంది. రోజాను  
బురదలో దొర్లే పంది మాదిరిగా ఊరిమీదకు జగన్ రెడ్డి వదిలేశాడు. రోజా జబర్దస్త్ షోలు, నీలి సినిమాలు ఇంటర్నెట్ లో చూసి యువత పెడదోవ పడుతోంది. ఇంటర్నెట్ లో నీ నీలి సినిమాలు ఉన్నాయి. సినీ పరిశ్రమకు తలవంపులు తెచ్చేలా నువ్వు నటించావు. రోజా! నువ్వా మాట్లాడేది? నీకసలు సిగ్గనేది ఉందా? నువ్వా! నీతులు చెప్పేది?’ అంటూ రోజాపై బుద్దా వెంకన్న తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

Andhra Pradesh
roja
budda venkanna
  • Loading...

More Telugu News