Srikakulam District: ఉద్ధానం ప్రాంతంలోని గ్రామాలన్నీ దత్తత తీసుకుంటే సమస్యలుండవు : మాజీ జేడీ లక్ష్మీనారాయణ

  • గ్రామాల దత్తతకు ఎన్ ఆర్ఐలు ముందుకురావాలి
  • పాలసీలు బాగుంటే సరిపోదు... అమలయ్యేలా చూడాలి
  • క్షేత్ర స్థాయిలో లోపాల వల్లే ఈ దుస్థితి 
  • నా తదుపరి పర్యటన అనంతపురం జిల్లా

ఉద్ధానం ప్రాంతంలోని గ్రామాలన్నీ దత్తత తీసుకుంటే సమస్యలుండవని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో తన పర్యటన ముగించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, గ్రామాల దత్తతకు ఎన్ ఆర్ఐలు ముందుకురావాలని కోరారు. పాలసీలు బాగుంటే సరిపోదని, వాటిని అమలయ్యేలా చూడాలని, క్షేత్ర స్థాయిలో లోపాల వల్లే ఈ దుస్థితి నెలకొందని అన్నారు. ఈ సందర్భంగా తన తదుపరి జిల్లా పర్యటన గురించి ప్రస్తావించారు. త్వరలో అనంతపురం జిల్లాలో పర్యటిస్తానని చెప్పారు. కాగా, శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన లక్ష్మీనారాయణ, సహలాలపుట్టుగ గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.

Srikakulam District
ex jd laxminarayana
  • Loading...

More Telugu News