afghanistan: ఆఫ్ఘనిస్థాన్ లో భారతీయ ఇంజనీర్ల కిడ్నాప్!
- విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో పనిచేస్తున్న ఇంజనీర్లు
- బస్సులో వెళుతుండగా అడ్డగించిన గుర్తుతెలియని సాయుధులు
- ధ్రువీకరించిన ఆఫ్ఘాన్ సర్కార్
ఆఫ్ఘనిస్థాన్ లో ఏడుగురు భారతీయులు కిడ్నాప్ కు గురయ్యారు. బాగ్లాన్ ప్రావిన్స్ ప్రాంతంలోని ఓ పవర్ ప్లాంట్ లో ఈ ఏడుగురు ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని ఆఫ్ఘాన్ ప్రభుత్వం ధ్రువీకరించింది. ఈ ఏడుగురిని తాలిబన్లు కిడ్నాప్ చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బాగ్లాన్ పోలీస్ అధికార ప్రతినిధి జబిహుల్లా షుజా మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్వహణలోని ఓ పవర్ స్టేషన్ కు ఈ ఏడుగురు ఇంజనీర్లు మినీ బస్సులో ఈరోజు వెళుతుండగా గుర్తుతెలియని సాయుధులు బస్సును అడ్డగించి వారిని అపహరించుకుపోయారు. ఈ సంఘటనపై కాబూల్ లోని భారత్ ఎంబసీకి చెందిన ఉన్నతాధికారులు మాట్లాడుతూ, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఆఫ్ఘనిస్థాన్ బ్రెష్నా షెర్ఖాత్ (డీఏబీఎస్)లో ఈ ఏడుగురు ఇంజనీర్లు పనిచేస్తున్నారని, కిడ్నాపర్ల చెర నుంచి వారిని విడిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.