Vizag: చూసుకుందాం రా...: టీడీపీ ఎమ్మెల్యే బండారుకు రోజా సవాల్

  • రోజాకు గుండు కొట్టిస్తానన్న ఎమ్మెల్యే బండారు
  • తీవ్రంగా మండిపడ్డ రోజా
  • దమ్ముంటే రావాలని సవాల్
  • బండారుకు బుద్ధి చెప్పేరోజు త్వరలోనే రానుందన్న రోజా

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజాకు గుండు కొట్టిస్తానని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ ప్రజా సంకల్పయాత్రకు సంఘీభావంగా విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో పాదయాత్ర నిర్వహిస్తుండగా, రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాను ప్రస్తుతం బండారు సత్యనారాయణ నియోజకవర్గంలోనే ఉన్నానని గుర్తు చేశారు. "నీ ఏరియాకే వచ్చాను. దమ్ముంటే ఇక్కడికి రా... ఎవరు గుండు కొట్టించగలరో చూసుకుందాం" అని ఆమె సవాల్ విసిరారు. నరవలో దళిత మహిళలపై పాశవికంగా దాడి చేయించిన ఘటనను ఇంకా ఎవరూ మరచిపోలేదని, బండారుకు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే రానుందని హెచ్చరించారు.

Vizag
Roja
Bandaru
Vijayasai Reddy
  • Loading...

More Telugu News