TTD: తిరుమల దేవస్థానాన్ని తమ అధీనంలోకి తీసుకోవాలన్న నిర్ణయం పలు అనుమానాలకు తావిస్తోంది: కేఈ కృష్ణమూర్తి

- పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకోవాలని కేంద్ర సర్కారు యోచన
- భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలి
- ఎవరికి ఏ అనుమానాలున్నా నివృతి చేస్తాం
- చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం
తిరుమల ఆలయాలన్నీ పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోన్న విషయం తెలిసిందే. తిరుమలలో ఉన్న ఆలయాలు, వాటి చరిత్రను పరిశీలించిన పురావస్తు శాఖ.. అవన్నీ పూర్వకాలంలో నిర్మాణమైనవిగా గుర్తించినట్లు వెల్లడించింది. తిరుమలలో పురాతన కట్టడాలకు రక్షణ కరవైందని ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొంది. అయితే, ఈ విషయంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందిస్తూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
