roja: హీరో రాజశేఖర్‌ లాంటి మనిషి ఇలాంటి పని చేశాడంటే ఎవ్వరూ నమ్మరు: రోజా

  • ఏదైనా ఉంటే వెంటనే బయటకు వస్తుంది
  • లేదంటే ఒకటి లేక రెండేళ్లలో వెలుగులోకొస్తుంది
  • రాజశేఖర్‌ ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నేళ్లయింది? 
  • కావాలనే వేరే ఉద్దేశంతోనే ఆయనను టార్గెట్‌ చేశారు

సినీనటుడు రాజశేఖర్‌, ఆయన భార్య జీవితపై ఇటీవల పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. తాజాగా, ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... "ఏదైనా ఉంటే వెంటనే బయటకు వస్తుంది. లేదంటే ఒకటి లేక రెండేళ్లలో వెలుగులోకొస్తుంది. రాజశేఖర్‌ ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నేళ్లయింది? నేను కూడా ఆయనతో రెండు సినిమాలు చేశాను. జీవిత లేకుండా రాజశేఖర్‌ బయటకు కూడా వెళ్లరు. ఇప్పుడు ఆయన తన పిల్లలు లేకుండా కూడా బయటకు వెళ్లట్లేదు.

అలాంటి మనిషి ఇలాంటి పని చేశాడంటే ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు. కావాలనే వేరే ఉద్దేశంతోనే ఆయనను టార్గెట్‌ చేసి ఇటువంటి ఆరోపణలు చేశారని అనుకుంటున్నాను. మా ఆయనకు కూడా రాజశేఖర్‌కి క్లోజ్‌ ఫ్రెండ్‌. ఆయనపై కావాలనే బురద చల్లారని అనిపించింది" అని రోజా అన్నారు.

roja
Casting Couch
Tollywood
  • Loading...

More Telugu News