kanpur: పైకి తీసుకెళుతోన్న ఎస్కలేటర్.. కిందకు దిగుతోన్న ప్రయాణికులు.. వీడియో వైరల్‌

  • కాన్పూర్‌ రైల్వే స్టేషన్‌లో ఘటన
  • ఎస్కలేటర్‌ ఉపయోగించుకునే విధానంపై అవగాహన లేమి
  • సూచనలతో బోర్డులు కూడా ఏర్పాటు చేయని అధికారులు

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ రైల్వే స్టేషన్‌లో ఎస్కలేటర్‌ ఎలా ఉపయోగించాలో తెలియక ప్రయాణికులు పడుతోన్న అవస్థలకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. వాటిని ఎలా ఉపయోగించాలో.. దిగడానికి, ఎక్కడానికి ఏయే ఎస్కలేటర్లను ఉపయోగించాలో తెలపడానికి అధికారులు కనీసం బోర్డులను కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది.

కొందరు ఎస్కలేటర్‌ ఉపయోగిస్తోన్న సమయంలో ఓ వ్యక్తి తీసిన వీడియోలోని సంఘటన ప్రయాణికుల అవస్థలకు అద్దం పడుతోంది. అందులో ఓ మహిళ ఎస్కలేటర్‌పై నానా ఇబ్బంది పడుతూ కనపడింది. చివరకు ఓ యువకుడి సాయంతో కిందకు దిగింది. చూడడానికి నవ్వు తెప్పించేలా ఉన్న వీడియో వైరల్‌ అవుతూ అధికారుల కళ్లు తెరిపిస్తోంది. కాగా, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణలో భాగంగా పలు స్టేషన్లలో కొత్తగా ఎస్కలేటర్లను ఏర్పాటు చేశారు. అయితే, వాటిని ఎలా ఉపయోగించుకోవాలనే విషయంలో అవగాహన లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.    

kanpur
railway station
Viral Videos
  • Error fetching data: Network response was not ok

More Telugu News