jagan: జగన్ అబద్దాలకోరు: జలీల్ ఖాన్

  • జగన్ వల్లే ప్రత్యేక హోదా రావడం లేదు
  • ఆయన చెప్పేవన్నీ అసత్యాలే
  • విజయవాడలో 70 కోట్లతో హజ్ హౌస్ నిర్మాణం

వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మరోసారి విరుచుకుపడ్డారు. కేవలం జగన్ వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రావడం లేదని ఆయన మండిపడ్డారు. జగన్ ఒక అబద్దాలకోరు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ చెబుతున్నవన్నీ అసత్యాలేనని విమర్శించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో రూ. 70 కోట్లతో హజ్ హౌస్ నిర్మాణం జరగబోతోందని చెప్పారు. ఈనెల 12వ తేదీన ఈ భవనాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని తెలిపారు.

jagan
jaleel khan
speacial status
  • Loading...

More Telugu News