maganti babu: మాగంటి బాబుకు స్టంట్ వేయాలా? వద్దా? అనేది నిర్ణయిస్తాం: డాక్టర్లు

  • సైకిల్ యాత్ర సందర్భంగా గుండెపోటుకు గురైన మాగంటి బాబు
  • ఆరోగ్యం నిలకడగా ఉందన్న డాక్టర్ రమేష్
  • మరో 48 గంటల విశ్రాంతి అవసరం

సైకిల్ యాత్ర సందర్భంగా టీడీపీ ఎంపీ మాగంటి బాబు గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను విజయవాడలోని ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రమేష్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ రమేష్ తెలిపారు. మరో రెండు రోజులు చికిత్స కొనసాగించిన తర్వాత స్టంట్ వేయాలా? వద్దా? అనే విషయాన్ని నిర్ణయిస్తామని చెప్పారు. మరో 48 గంటల పాటు మాగంటి బాబుకు పూర్తి విశ్రాంతి అవసరమని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి నాయకులు, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆరేళ్ల క్రితం యాంజియోగ్రామ్ టెస్ట్ చేసిన సమయంలో బాబుకు ఒక బ్లాక్ ఉందని, ఇప్పుడు రెండు బ్లాక్స్ ఉన్నాయని... దీనివల్లే ఆయన అస్వస్థతకు గురయ్యారని తెలిపారు.

maganti babu
heart attack
  • Loading...

More Telugu News