muhammad ali jinnah: జిన్నా పోస్టర్లు చించేస్తే రూ.లక్ష రివార్డుగా ఇస్తాం: ముస్లిం మహాసంఘ్

  • పాకిస్థాన్ లో ఏ సంస్థా భారత నేత ఫొటో పెట్టుకోదు
  • మనం కూడా అదే పాటించాలి
  • జిన్నాను, పాకిస్థాన్ ను వ్యతిరేకించాలని పిలుపు

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో పాకిస్థాన్ వ్యవస్థాపకుడు ముహమ్మద్ అలీ జిన్నా పోట్రయిట్ కనిపించడంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఆ పోస్టర్లు చించేసిన వారికి లక్ష రూపాయలు రివార్డుగా ఇస్తామని ఆల్ ఇండియా ముస్లిం మహాసంఘ్ చీఫ్ ఫర్హత్ అలీ ఖాన్ ప్రకటించారు. పాకిస్థాన్ లో ఏ సంస్థ కూడా స్వాతంత్య్రం కోసం పోరాడిన భారత నేతలకు సంబంధించిన ఫొటోలు పెట్టుకోదని, అదే విధానాన్ని మన దేశంలోనూ పాటించాలని పిలుపునిచ్చారు. జిన్నా పోస్టర్లతో పాటు అతని లాంటి వ్యక్తుల పోస్టర్లను చించేయాలని కోరారు. పోస్టర్లను కాల్చేసిన వారికి రూ.లక్ష రివార్డుగా ఇస్తామన్నారు. భారత్ లోని ముస్లింలు జిన్నాను, పాకిస్థాన్ ను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఇదే విషయమై అలీగఢ్ లో ఇరు వర్గాల మధ్య వివాదం రాజుకోవడంతో పోలీసులు 144 సెక్షన్ విధించి, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

muhammad ali jinnah
pakistan
muslim unicersity
  • Loading...

More Telugu News