Bharath Ane Nenu: ‘భరత్ అనే నేను’ ఎడిటింగ్ లో డిలీట్ చేసిన సన్నివేశాలు ఇవి!
- డిలీట్ చేసిన సన్నివేశాలను పోస్ట్ చేసిన చిత్ర యూనిట్
- ఓ రైతుతో, ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ తో, అసెంబ్లీలో మహేష్ మాట్లాడే సన్నివేశాలు
- ఈ సినిమా రన్ టైం 3 గంటలు దాటడం వల్లే సన్నివేశాల తొలగింపు
కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ చిత్రం బాక్సాఫీసు రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా రన్ టైం మూడు గంటలు దాటడంతో కొన్ని సన్నివేశాలను ఎడిటింగ్ లో డిలీట్ చేసి ఈ చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది. డిలీట్ చేసిన సన్నివేశాల గురించి చిత్ర యూనిట్ ప్రస్తావించింది. ఆయా సన్నివేశాలను ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసింది. ఈ సినిమాలో విద్యా వ్యవస్థ గురించిన ఓ కీలక సన్నివేశం, దాని కంటిన్యుయేషన్ గా మరో సన్నివేశం ఉంటాయి. ఎడిటింగ్ లో తొలగించిన కంటిన్యుయేషన్ సన్నివేశాన్ని చిత్ర యూనిట్ పోస్ట్ చేసింది. అదే విధంగా, ఈ చిత్రంలో రైతుతో మహేష్ బాబు మాట్లాడే మరో సన్నివేశాన్ని కూడా తొలగించారు. ఆ సన్నివేశాన్ని చిత్ర యూనిట్ పోస్ట్ చేసింది. ఈ సినిమాలో అసెంబ్లీలో మహేష్ బాబు మాట్లాడే మరో సన్నివేశాన్ని కూడా తొలగించింది. దీనిని కూడా చిత్ర యూనిట్ పోస్ట్ చేసింది.