Srikakulam District: సహలాలపుట్టుగ గ్రామాన్ని దత్తత తీసుకున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ

  • సహలాలపుట్టుగ గ్రామంలో పర్యటించిన లక్ష్మీనారాయణ
  • గ్రామస్తులతో కలిసి పరిసరాలను శుభ్రం చేసిన వైనం
  • శ్రీకాకుళంలో మూడు రోజుల పర్యటన ఈరోజుతో ముగియనుంది

శ్రీకాకుళం జిల్లాలో ఐపీఎస్ మాజీ అధికారి లక్ష్మీనారాయణ మూడు రోజుల పర్యటన ఈరోజుతో ముగియనుంది. తన పర్యటనలో భాగంగా ఈరోజు సహలాలపుట్టుగ గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. సహలాలపుట్టుగ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. సామాజికవర్గం కాదు సమాజమే ముఖ్యమని, విమర్శలు చేస్తున్నవారు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మాట్లాడాలని హితవు పలికారు. కాగా, ప్రజా సమస్యలపై అధ్యయనం నిమిత్తం ఈ నెల 3న లక్ష్మీనారాయణ తన పర్యటనను ప్రారంభించారు. కిడ్నీ బాధితులు, రైతులు, చేనేత కార్మికుల స్థితిగతులపై అధ్యయనం చేస్తానని ఆయన పేర్కొన్న విషయం విదితమే.

Srikakulam District
ex jd laxminarayana
  • Loading...

More Telugu News