imd: దేశంలోని పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ సూచన

  • ఢిల్లీ, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలకు అవకాశం
  • ఉత్తరాఖండ్, హిమాచల్, జమ్మూకశ్మీర్ లో వడగళ్లు పడొచ్చు
  • ఆయా రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ

ఈ నెల 6,7 తేదీల్లో అప్రమత్తంగా ఉండాలని దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సూచించింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో వడగళ్ల వానలు కురవచ్చని, అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీఘడ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో వచ్చే నాలుగు రోజుల్లో వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, ఆయా రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఐఎండీ అధికారులు సూచించారు. కాగా, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా 124 మంది మృతి చెందారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ. 50 వేల చొప్పున ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించారు.

  • Loading...

More Telugu News