raghurama krishnam raju: చాలా కాలంగా టీడీపీ నేతలతో సన్నిహితంగా ఉంటున్నా: రఘురామ కృష్ణంరాజు

  • చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను
  • చంద్రబాబు కార్యదక్షత నారా లోకేశ్‌లో వుంది  
  • గాంధీ వంటి మహానేతల లక్షణాలు చంద్రబాబుకి ఉన్నాయి

తాను టీడీపీలో ఇప్పుడు చేరుతున్నప్పటికీ ఆ పార్టీ నేతలతో చాలా కాలంగా సన్నిహితంగానే ఉంటున్నానని పశ్చిమ గోదావరి జిల్లా నేత రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఈ రోజు విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ... తనపై చంద్రబాబు నాయుడు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. చంద్రబాబు కార్యదక్షత, ఎన్టీఆర్‌ కలుపుగోలుతనం నారా లోకేశ్‌లో ఉన్నాయని ప్రశంసించారు. అలాగే, మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామ రాజు వంటి మహానేతల లక్షణాలు చంద్రబాబు నాయుడిలో ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.    

raghurama krishnam raju
Telugudesam
Chandrababu
  • Loading...

More Telugu News