keerthi suresh: 'మహానటి' రిలీజ్ డేట్ వెనుక సెంటిమెంట్!

  • కీర్తి సురేశ్ ప్రధాన పాత్రగా 'మహానటి'
  • తెలుగు .. తమిళ భాషల్లో రిలీజ్ 
  • అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి  

తెలుగు తెరపై నవరసాలను నడిపించిన సావిత్రికి, తెలుగు .. తమిళ భాషల్లో అనేక మంది అభిమానులు వున్నారు. అందువలన ఈ సినిమాను ఈ రెండు భాషల్లోను విడుదల చేయనున్నారు. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాను ఈ నెల 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

సాధారణంగా ప్రతి గురు .. శుక్రవారాల్లో సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. కానీ 'మహానటి' సినిమాను మాత్రం ఈ నెల 9వ తేదీన (బుధవారం) విడుదల చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వెనుక అశ్వనీదత్ సెంటిమెంట్ ఉందని అంటున్నారు. గతంలో ఆయన నిర్మించిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' ఇదే రోజున విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. అందువలన ఇదే రోజున ఈ సినిమాను రిలీజ్ చేయమని తన కూతుళ్లకు అశ్వనీదత్ చెప్పారట. అందువల్లనే ఈ సినిమా బుధవారం రోజున ప్రేక్షకుల ముందుకు వస్తోందని చెబుతున్నారు.    

  • Loading...

More Telugu News