nela ticket: 'నేల టికెట్టు' ఆడియో లాంచ్ కు చీఫ్ గెస్ట్ ఎవరో క్లారిటీ ఇచ్చేశారు

  • చీఫ్ గెస్ట్ పవన్ కల్యాణే
  • అనౌన్స్ చేసిన దర్శకుడు కల్యాణ్ కృష్ణ
  • ఈనెల 10న ఆడియో ఫంక్షన్

మాస్ మహరాజా రవితేజ, దర్శకుడు కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో వస్తున్న 'నేల టికెట్' సినిమా ఆడియో ఫంక్షన్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వస్తున్నారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, చీఫ్ గెస్ట్ విషయం ఇంకా అధికారికంగా ఖరారు కాలేదని కల్యాణ్ కృష్ణ కూడా ఇంతకు ముందు ట్వీట్ చేశారు.

ఇప్పుడు ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ ఎవరో అఫీషియల్ గా ప్రకటించారు. పవన్ కల్యాణ్ ఈ ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా వస్తున్నారని కల్యాణ్ కృష్ట ట్వీట్ చేశాడు. ఇది అఫీషియల్ అనౌన్స్ మెంట్ అని చెప్పారు. ఈ నెల 10వ తేదీన ఆడియో ఫంక్షన్ ఉంటుందని తెలిపారు. మరోవైపు ఈ సినిమాను ఈనెల 24న విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.

nela ticket
Raviteja
Pawan Kalyan
tollywood
audio function
chief guest
  • Loading...

More Telugu News