maganti babu: టీడీపీ ఎంపీ మాగంటి బాబుకి స్వల్ప గుండెపోటు.. ఆసుపత్రిలో చికిత్స

  • చింతల పూడిలో ఘటన
  • సైకిల్‌ యాత్రలో పాల్గొన్న మాగంటి బాబు
  • సొమ్మసిల్లి పడిపోయిన ఎంపీ
  • ఆసుపత్రికి తరలించిన కార్యకర్తలు

పశ్చిమ గోదావరి జిల్లా చింతల పూడిలో సైకిల్‌ యాత్రలో పాల్గొంటోన్న టీడీపీ ఎంపీ మాగంటి బాబు సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనను టీడీపీ కార్యకర్తలు ఏలూరులోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మాగంటి బాబుకి పాథమిక చికిత్స అందించామని, ఆయనకు స్వల్ప గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు. కాసేపట్లో ఆయనను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించేందుకు టీడీపీ నేతలు ఏర్పాటు చేస్తున్నారు. 

maganti babu
Telugudesam
Andhra Pradesh
  • Loading...

More Telugu News