Chandrababu: బాధిత కుటుంబానికి సీఎం చంద్రబాబు రూ.5 లక్షలు ప్రకటించారు: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

  • దాచేపల్లి ఘటన దురదృష్టకరం
  • ఈ ఘటనపై చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు
  • బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే యరపతినేని రూ.2 లక్షలు ప్రకటించారు

దాచేపల్లిలో అత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబానికి సీఎం చంద్రబాబు రూ.5 లక్షలు ప్రకటించినట్టు ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు రూ.2 లక్షలు ప్రకటించినట్టు చెప్పారు. దాచేపల్లి ఘటన దురదృష్టకరమని, ఈ ఘటనపై చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పాల్సింది పోయి ఈ ఘటనను రాజకీయం చేయాలని కొందరు చూస్తున్నారని మండిపడ్డారు.

కాగా, టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ, దాచేపల్లి ఘటనపై సీఎం వెంటనే స్పందించి చర్యలకు ఆదేశించారని అన్నారు. దాచేపల్లి ఘటనను రాజకీయం చేయొద్దని, కులం, మతం వాకబు చేసి వైసీపీ మహిళానేతలు హేయంగా ప్రవర్తిస్తున్నారని అనురాధ మండిపడ్డారు.

Chandrababu
pulla rao
dachepalli
  • Loading...

More Telugu News