mudragada: మీరు నిప్పు కదా.. నిప్పుకు కూడా భయం ఉంటుందా?: చంద్రబాబుకు ముద్రగడ లేఖ

  • ప్రజలు మీ వెనుక ఎందుకుండాలి?
  • లోకేష్ కేసులపై సీబీఐ విచారణకు ఎందుకు డిమాండ్ చేయడం లేదు?
  • లోకేష్ ను అరెస్ట్ చేస్తే.. స్టే తెచ్చుకోకండి

మీరు ఏం ఘనకార్యం చేశారని ప్రజలు మీ వెంట ఉండాలని కోరుకుంటున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కాపు నేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. మీ వెనకాలే ప్రజలు ఉంటే.... మీ కేసులతో వారు కూడా ఇబ్బంది పడతారని అన్నారు. ఈ మేరకు చంద్రబాబుకు ఆయన ఒక లేఖ రాశారు.

గుమ్మడికాయల దొంగ ఎవరంటే మీరు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. మీ కుమారుడిపై వస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో, సీబీఐ చేత విచారణ చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు సవాల్ చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. సీబీఐ విచారణకు డిమాండ్ చేయకపోతే మీరు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు. ఒకవేళ మీ కుమారుడు లోకేష్ ను అరెస్ట్ చేస్తే... కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవద్దనేది తన సలహా అని లేఖలో పేర్కొన్నారు. 

mudragada
Chandrababu
Nara Lokesh
letter
  • Loading...

More Telugu News