railway: సమయపాలనలో రైల్వే ఘోరం... 30 శాతం రైళ్లు ఆలస్యమే!

  • 2017-18లో సమయానికి నడిచిన రైళ్లు 71.39 శాతం
  • మరమ్మతుల వల్లేనన్న రైల్వే శాఖ
  • తగ్గిన ప్రమాదాల సంఖ్య
  • గత ఆర్థిక సంవత్సరంలో 73కు పరిమితం

సమయానికి రైలు వచ్చి, సమయానికి గమ్య స్థానానికి తీసుకెళితే ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అయితే, ఆలస్యంగా రావడం ప్రయాణికులకు తరచుగా అనుభవం అయ్యేదే. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రైళ్ల సమయపాలన మరింత గతి తప్పింది. ఏకంగా 30 శాతం రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఎక్స్ ప్రెస్, మెయిల్ రైళ్ల సమయపాలన 71.39 శాతంగా నమోదైంది. అంతకుముందు సంవత్సరంలో ఇది 76.69 శాతంగా ఉండడం గమనార్హం. మరమ్మతు చర్యలను పెద్ద ఎత్తున చేపట్టినందున ఆ ప్రభావం రైళ్ల ప్రయాణాలపై పడినట్టు రైల్వే తెలిపింది. రైళ్ల ట్రాక్ ఆధునికీకరణ, మెరుగుపరిచే పనులు భారీ స్థాయిలో కొనసాగుతున్నాయని పేర్కొంది.

ఇక రైలు ప్రమాదాలు మాత్రం తగ్గాయి. 35 ఏళ్లలో తొలిసారిగా ప్రమాదాలు రెండంకెల స్థాయికి తగ్గుముఖం పట్టాయి. 2014-15లో 135 ప్రమాదాలు జరగ్గా, 2015-16లో 107 ప్రమాదాలు, 2016-17లో 104 ప్రమాదాలు జరిగితే, 2017-18లో 7కు పరిమితం అయ్యాయని రైల్వే వెల్లడించింది.

  • Loading...

More Telugu News