FLIPKART: ఈ నెల 13-16 మధ్య ఫ్లిప్ కార్ట్ భారీ షాపింగ్ ఉత్సవం

  • మొబైల్స్, ఇతర గ్యాడ్జెట్లపై భారీ తగ్గింపులు
  • రూపాయికే సొంతం చేసుకునే అవకాశం
  • నోకాస్ట్ ఈఎంఐ సదుపాయం

ఏటా వేసవిలో ఫ్లిప్ కార్ట్ భారీ ఆఫర్లతో నిర్వహించే విక్రయాలకు తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 13 నుంచి 16 వరకు నాలుగు రోజుల పాటు ‘బిగ్ షాపింగ్ డేస్’ పేరుతో ఫ్లిప్ కార్ట్ అమ్మకాల ఉత్సవాన్ని చేపడుతోంది. మొబైల్స్, గ్యాడ్జెట్లు, ఫ్యాషన్, అప్లయెన్సెస్ పై భారీ తగ్గింపులను ఆఫర్ చేస్తున్నట్టు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ ను బ్యాంకు క్రెడిట్ కార్డులు, బజాజ్ కార్డులపై అందిస్తోంది. అలాగే, డెబిట్ కార్డులపై ‘బై నౌ పే లేటర్’ అవకాశం కల్పిస్తోంది.

చిన్న ఆటను ప్లే చేయడం ద్వారా ల్యాప్ టాప్ లు, మొబైల్స్ ను కేవలం రూపాయికే సొంతం చేసుకోవచ్చని, అలాగే, బిగ్ షాపింగ్ డేస్ రోజున కొన్న వాటిపై 100 శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం సొంతం చేసుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. మొబైల్స్ పై ఇంతవరకు చూడని తగ్గింపులను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ల్యాప్ టాప్ లు, కెమెరాలు, పవర్ బ్యాంకులు, టాబ్లెట్లు, ఇతర గ్యాడ్జెట్లు, టీవీలపై 80 శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేస్తోంది. మరో సంస్థ అమేజాన్ నుంచి తగ్గింపు విక్రయాలపై ప్రకటన వెలువడాల్సి ఉంది.

FLIPKART
big shopping days
  • Loading...

More Telugu News