Guntur District: 15 రోజుల్లోగా దాచేపల్లి మృగాడిని పట్టుకోకుంటే ఉద్యోగానికి రాజీనామా చేస్తా!: గుంటూరు రూరల్ ఎస్పీ అప్పలనాయుడు

  • నిరసనలు తెలియజేస్తున్న వారితో మాట్లాడిన అప్పలనాయుడు
  • 15 రోజుల సమయం కావాలని వినతి
  • శాంతి భద్రతల సమస్యగా మార్చవద్దని విజ్ఞప్తి
  • సుబ్బయ్యకు ఉరిశిక్ష పడేలా చూస్తానని హామీ

గుంటూరు జిల్లా దాచేపల్లిలో బాలికపై అత్యాచారం చేసిన కీచకుడు సుబ్బయ్యను అరెస్ట్ చేసేందుకు తనకు పదిహేను రోజుల సమయం ఇవ్వాలని రూరల్ ఎస్పీ అప్పలనాయుడు కోరారు. ఈలోగా అతన్ని అదుపులోకి తీసుకోలేకుంటే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. దాచేపల్లిలో నిరసన తెలియజేస్తున్న ముస్లిం సంఘాలు, ప్రజలను ఎంతగా సముదాయించాలని చూసినా వినకపోవడంతో, అందరినీ ఉద్దేశించి ఎస్పీ మాట్లాడారు.

తన మాట వినాలని, సమస్యను శాంతిభద్రతల సమస్యగా మార్చవద్దని కోరారు. నిందితుడి కుటుంబ సభ్యులంతా తమ అధీనంలోనే ఉన్నారని, సుబ్బయ్య తప్పించుకునే అవకాశం లేదని నచ్చజెప్పారు. అతనికి ఉరిశిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. నిరసనలు ఆపాలని విజ్ఞప్తి చేశారు. నిరసనకారులు వర్షంలోనూ తమ ఆందోళన కొనసాగిస్తూ ఉండటంతో పిడుగురాళ్ల నుంచి కారంపూడి, మాచర్ల మీదుగా ట్రాఫిక్ ను మళ్లించారు.

Guntur District
Dachepalli
Appalanaidu
Rural SP
Subbaiah
  • Loading...

More Telugu News