Hyderabad: పాకిస్థాన్ గూఢచారికి జీవిత ఖైదును ఖరారు చేసిన హైదరాబాద్ హైకోర్టు

  • టూరిస్టు వీసాపై ఇండియాకు వచ్చిన ఆషిక్ అలీ
  • పాకిస్థానీతో మాట్లాడుతుండగా అరెస్ట్ చేసిన నిజామాబాద్ పోలీసులు
  • జీవిత ఖైదు సరైనదేనన్న హైదరాబాద్ హైకోర్టు

పాకిస్థాన్ నుంచి టూరిస్టు వీసాపై ఇండియాకు వచ్చి, రక్షణ రహస్యాలను చేరవేస్తూ పట్టుబడిన ఆషిక్ అలీకి జీవిత ఖైదును ఖరారు చేస్తున్నట్టు హైదరాబాద్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సురేష్ కుమార్ కైత్, జస్టిస్ యూ. దుర్గా ప్రసాదరావు తీర్పిచ్చారు. జూన్ 15, 2001న రెండు నెలల వీసాపై న్యూఢిల్లీ, కాన్పూర్ సందర్శనకు వచ్చిన అలీ, ఆపై పాస్ పోర్టును నాశనం చేసి, అమృత్ సర్, బటాలా, హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో తిరిగాడు.

సున్నిత సమాచారాన్ని పాక్ కు ఈ-మెయిల్ ద్వారా పంపించాడు. ఆపై 2002 జనవరి 26 రాత్రి నిజామాబాద్ లోని జానపల్లి జంక్షన్ నుంచి, పాకిస్థాన్ లోని ఓ వ్యక్తికి ఫోన్ చేస్తూ పట్టుబడ్డాడు. కేసును విచారించిన నిజామాబాద్ కోర్టు, ఐపీసీలోని పలు సెక్షన్లు, విదేశీ వ్యవహార చట్టాలు, అధికార రహస్యాల చట్టాల కింద విచారించి జీవిత ఖైదును విధించింది. దీనిపై దోషి ఆషిక్ అలీ, హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు తీర్పిస్తూ, జీవిత శిక్ష సరైనదేనని వ్యాఖ్యానించింది.

  • Loading...

More Telugu News