Chandrababu: చంద్రబాబు కాలిగోటికి కూడా విజయసాయిరెడ్డి పనికిరారు: మంత్రి ఆనంద్ బాబు

  • విజయసాయికి దమ్ముంటే  విశాఖలో కార్పొరేటర్ గా గెలవాలి
  • ఒకవేళ ఆయన గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా 
  • కేంద్రం, సుప్రీంకోర్టు కుమ్మక్కై ఎస్సీ, ఎస్టీల హక్కులను కాలరాస్తున్నాయి

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మంత్రి నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు కాలి గోటికి కూడా విజయసాయిరెడ్డి పనికిరారని అన్నారు. విజయసాయిరెడ్డికి దమ్ముంటే విశాఖలో కార్పొరేటర్ గా పోటీ చేసి గెలవాలని, ఒకవేళ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆనంద్ బాబు సవాల్ విసిరారు.

ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ హక్కుల గురించి ఆనంద్ బాబు ప్రస్తావిస్తూ, కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు కుమ్మక్కై ఎస్సీ, ఎస్టీల హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టులో సమగ్ర వాదనలు వినిపించడంలో కేంద్రం విఫలమైందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ హక్కుల విషయమై వెంటనే పార్లమెంట్ ను సమావేశపరిచి ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆనంద్ బాబు డిమాండ్ చేశారు.

Chandrababu
vijaya sai reddy
nakka anand babu
  • Loading...

More Telugu News