టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ లిస్ట్ టాప్ టెన్ లో ముగ్గురు టాలీవుడ్ హీరోలు!
- 50 మందితో కూడిన మోస్ట్ డిజైరబుల్ లిస్ట్ ను విడుదల చేసిన టైమ్స్
- తొలి స్థానాన్ని కైవసం చేసుకున్న రణ్ వీర్ సింగ్
- విరాట్ కోహ్లీకి మూడో స్థానం
క్రేజ్, పాప్యులారిటీ ఆధారంగా 50 మందితో కూడిన మోస్ట్ డిజైరబుల్ జాబితాను ప్రతి ఏటా టైమ్స్ విడుదల చేస్తుంటుంది. 'బాహుబలి' సినిమాతో ప్రభాస్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఇప్పుడు ప్రభాస్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. బాలీవుడ్ హీరోలకు సమానమైన ఫాలోయింగ్ ను యంగ్ రెబల్ స్టార్ సొంతం చేసుకున్నాడు. ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' ఇప్పుడు అబుదాబిలో షూటింగ్ జరుపుకుంటోంది.