dhoni: ఆటగాళ్లంతా ఆత్మవిమర్శ చేసుకోవాలి: ధోనీ అసహనం

  • బౌలింగ్, ఫీల్డింగ్ పై ధోనీ ఆగ్రహం
  • బౌలర్లు సరైన ప్రదర్శన చేయాలి
  • కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి అనంతరం ధోనీ వ్యాఖ్యలు

కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయం పాలుకావడం పట్ల చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ అసహనం వ్యక్తం చేశాడు. బౌలింగ్, ఫీల్డింగ్ రంగాల్లో ఆటగాళ్లు విఫలం కావడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. లైన్ అండ్ లెంగ్త్ ను మిస్ అయి, బౌలింగ్ ప్లాన్ ను సరిగా అమలు చేయలేక చెన్నై బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.

 ఏడో ఓవర్ కే కీలక ఆటగాళ్లు రాబిన్ ఊతప్ప, సునీల్ నరైన్, క్రిస్ లిన్ లను పెవిలియన్ కు పంపిన చెన్నై బౌలర్లు... ఆ తర్వాత అదే ఆటతీరును కొనసాగించలేకపోయారు. కేకేఆర్ కెప్టెన్ దినేష్ కార్తీక్, యువ బ్యాట్స్ మెన్ శుభ్ మన్ గిల్ లు చెన్నై బౌలర్లను ఓ పట్టు పట్టి... తమ జట్టును విజయతీరాలకు చేర్చారు.

ఈ నేపథ్యంలో, ఫీల్డింగ్ పొరపాట్లపై ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లు ఈ ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించాడు. బౌలర్లు సరైన ప్రదర్శన చేయకపోతే, వారిని తరచుగా మార్చాల్సి ఉంటుందని చెప్పాడు.  

dhoni
kkr
csk
ipl
  • Loading...

More Telugu News