gouru venkat reddy: కాటసాని చేరికతో వైసీపీలో లొల్లి.. జగన్ మాకు అన్యాయం చేయరన్న గౌరు

  • కాటసాని వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది
  • పాణ్యం టికెట్ తనదే అంటూ అసత్య ప్రచారం చేసుకుంటున్నారు
  • జగన్ నుంచి తమకు స్పష్టమైన హామీ ఉంది

మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. పాణ్యం టికెట్ ఇస్తామంటూ ఆయనకు జగన్ హామీ ఇచ్చినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కాటసానిపై కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. కాటసాని చేరికతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఆయన అన్నారు. జగన్ ను రాంభూపాల్ రెడ్డి ఎన్నిసార్లు కలిసినా... పాణ్యం టికెట్ గౌరు చరితకే వస్తుందని చెప్పారు. ఈ మేరకు తమకు జగన్ నుంచి స్పష్టమైన హామీ ఉందని అన్నారు. జగన్ తమకు అన్యాయం చేయరని ధీమా వ్యక్తం చేశారు.

గత ఎన్నికల సమయంలో కూడా నామినేషన్ వేసేంత వరకు పాణ్యం వైసీపీ టికెట్ తనకే వస్తుందని కాటసాని ప్రచారం చేసుకున్నారని... ఇప్పుడు మళ్లీ పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని గౌరు వెంకటరెడ్డి మండిపడ్డారు. అవకాశం ఉంటే అధిష్ఠానం వద్ద ప్రయత్నాలు చేసుకోవాలే కానీ, నియోజకవర్గంలో తప్పుడు ప్రచారం చేసుకోవడం సీనియర్ నాయకుడైన కాటసానికి తగదని అన్నారు. 

gouru venkat reddy
guru charitha
katasani rambhupal reddy
YSRCP
kurnool
jagan
panyam
ticket
  • Loading...

More Telugu News