West Godavari District: నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి కేవీపీ వియ్యంకుడు

  • టీడీపీలో చేరనున్న రఘురామ కృష్ణంరాజు
  • ఇప్పటివరకూ బీజేపీలో ఉన్న నేత
  • పలు పరిశ్రమలతో వందలాది మందికి ఉపాధి 
  • స్వాగతించిన తెలుగుదేశం నేతలు

ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు వియ్యంకుడు రఘురామ కృష్ణంరాజు నేడు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్న ఆయన, ఇటీవలే టీడీపీలో చేరనున్నట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రఘురామ కృష్ణంరాజు, ఆ ప్రాంతంలో పలు పరిశ్రమలను నడుపుతూ వందలాది మందికి ఉపాధిని కల్పిస్తున్నారు. నేడు భారీ ర్యాలీతో విజయవాడకు వచ్చే ఆయన చంద్రబాబును కలిసి పచ్చ కండువాను కప్పుకోనున్నారు. ఆయన చేరికను స్వాగతిస్తున్నట్టు పలువురు టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. ఆయన రాకతో పశ్చిమ గోదావరిలో పార్టీ మరింతగా బలపడుతుందని వ్యాఖ్యానించారు.

West Godavari District
Raghuramakrishnamraju
KVP
  • Loading...

More Telugu News