raghuveera reddy: ఏపీలో కొంతకాలంగా అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయి: రఘువీరారెడ్డి

  • దాచేపల్లి ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి
  • అత్యాచారాల్లో దేశంలోనే ఏపీ ఆరో స్థానంలో ఉంది
  • చంద్రబాబు పాలనలో రక్షణ లేకుండా పోయింది

గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటనపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు విజయవాడలోని ఏపీసీసీ కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. మహిళలపై జ‌రిగే హింస‌, అత్యాచారాల్లో దేశంలోనే ఏపీ ఆరో స్థానంలో ఉందని, చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు.

ఏపీలో కొంతకాలంగా అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయ‌ని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా క‌ఠిన‌మైన‌ చర్యలు చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వానికి సూచించారు. దాచేపల్లి బాధిత బాలికకు మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. బాధితురాలి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండ‌గా ఉంటుంద‌న్నారు.

raghuveera reddy
Congress
Andhra Pradesh
  • Loading...

More Telugu News