Uttar Pradesh: యూపీలో 64 మంది మృతి చెందారు.. ఆ రాష్ట్ర సీఎం కర్ణాటకలో ఉన్నారు: సిద్ధరామయ్య

  • కుంభవృష్టి కారణంగా యూపీ ప్రజల ఇబ్బందులు
  • యూపీ సీఎం కర్ణాటకలో ఉండాల్సి వస్తోంది
  • ఆయన వెళ్లి చేయాల్సిన పనులు చేస్తారని ఆశిస్తున్నాను

రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో దుమ్ము, ధూళితో గాలి, కుంభవృష్టి కారణంగా సుమారు 70 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కొన్ని రోజుల నుంచి ట్వీట్లు చేస్తూ బీజేపీ నేతలపై విమర్శల వర్షం కురిపిస్తోన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాజాగా ఓ ట్వీట్‌ చేసి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను విమర్శించారు.

'కుంభవృష్టి కారణంగా ఉత్తరప్రదేశ్‌లో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి కర్ణాటకలో ఉండాల్సి వస్తోంది. ఆయన త్వరలోనే ఉత్తరప్రదేశ్‌కి వెళ్లి చేయాల్సిన పనులను చేస్తారని ఆశిస్తున్నాను' అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.  

Uttar Pradesh
Congress
BJP
sidda ramaiah
yogi
  • Error fetching data: Network response was not ok

More Telugu News